Kushita Kallapu: రవితేజ కంట్లో పడి హీరోయిన్ గా మారిన బజ్జీల పాప!

Kushita Kallapu as Heroine in Changure Bangaru Raja Movie:  రాహుల్ సిప్లిగంజ్, నిహారిక పబ్ వ్యవహారంలో ఖుషిత కళ్లపు అనే అమ్మాయి కూడా బాగా ఫేమస్ అయింది. ఈ భామ ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2022, 10:50 PM IST
Kushita Kallapu: రవితేజ కంట్లో పడి హీరోయిన్ గా మారిన బజ్జీల పాప!

Kushita Kallapu as Heroine in Changure Bangaru Raja Movie:  రాహుల్ సిప్లిగంజ్, నిహారిక పబ్ వ్యవహారంలో ఖుషిత కళ్లపు అనే అమ్మాయి కూడా బాగా ఫేమస్ అయింది. పబ్ కు బజ్జీలు తినడానికే వెళ్లామని చెప్పి సోషల్ మీడియాలో బజ్జీల పాప పేరుతొ ఆమె క్రేజ్ తెచ్చుకుంది. అయితే అప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్ లో సందడి చేసిన ఈ భామ ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా మారింది. 

మాస్ మహారాజా రవితేజ ఈమధ్యనే సొంత ప్రొడక్షన్ సంస్థ ఆర్‌టి టీమ్‌ వర్క్స్‌ ప్రారంభించారు. టాలెంట్ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించడానికి కంటెంట్ ప్రాధాన్యత గల సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెం 4గా ‘ఛాంగురే బంగారురాజా’ అనే కొత్త సినిమా ప్రారంభం అయింది. 
 
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా కేరాఫ్ కంచరపాలెం’, ‘నారప్ప’ సినిమాలలో కీలకపాత్రలు పోషించిన కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్నారు. ఖుషిత కళ్లపు అదేనండీ బజ్జీల పాప హీరోయిన్ గా నటించనుంది. కమెడియన్ సత్య, రవిబాబు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. 
 
గురువారం నాడు ‘ఛాంగురే బంగారురాజా’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైయింది. ముహూర్తం షాట్‌కి రవితేజ క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా, హీరో విష్ణు విశాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఇక రచయిత బివిఎస్ రవి, దర్శకుడు సుధీర్ బాబు స్క్రిప్ట్ ను సతీష్ వర్మకు అందించారు. ముహూర్తపు షాట్ కు రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. 
 
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుంది. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా ‘ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్’తో కలిసి ఈ సినిమాను రవితేజ టీమ్ వర్క్స్ నిర్మిస్తోంది. కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సుందర్ ఎన్సి సినిమాటోగ్రాఫర్, కృష్ణ కార్తీక్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. 

Also Read: Actress Hema: సురేఖ ఓర్వలేకపోయింది.. నా గురించి ఆ మాటలు కూడా.. ఆరోపణలు గుప్పించిన హేమ!

Also Read: Rajamouli: దర్శకధీరుడికి అరుదైన అవకాశం.. టాలీవుడ్ నుంచి మొదటి వ్యక్తిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News