మహర్షి మూవీ నిర్మిత దిల్ రాజుకు ఐటీ షాక్; కారణం ఇదేనా ?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు
హైదారబాద్: మహర్షి మూవీ నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజుపై ఐటీ అధికారులు కన్నేశారు. ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బృందంగా ఏర్పడిన ఐటీ అధికారులు .. అమీర్‌పేట శ్రీనగర్ కాలనీలోని దిల్‌రాజు కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు.
భారీ బడ్జెత్ తో మహర్షి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని నిర్మించిన వారిలో దిల్ రాజు ఒకరు. కాగా దిల్‌రాజుతో పాటు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
కాగా మూవీ రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఈ ఈ దాడులు నిర్వహించడం గమనార్హం. దిల్ రాజుపై ఐటీ కన్నేయడానికి కారణం మహర్షి మూవీలో ఆయన పెట్టిన భారీ పెట్టుబడులే కారణమనే టాక్ వినిపిస్తోంది.