మళ్లీ హీరోగా బాలనటుడు మహేంద్రన్
దేవీ, ఆహా, పెదరాయుడు లాంటి సినిమాల్లో బాలనటుడిగా నటించి ప్రేక్షకుల కితాబు అందుకున్న నటుడు మహేంద్రన్.
దేవీ, ఆహా, పెదరాయుడు లాంటి సినిమాల్లో బాలనటుడిగా నటించి ప్రేక్షకుల కితాబు అందుకున్న నటుడు మహేంద్రన్. తెలుగు, తమిళంలో దాదాపు 50 చిత్రాలలో నటించిన మహేంద్రన్ కొన్ని సంవత్సరాలుగా డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. రెండు నంది అవార్డులు.. ఒకసారి తమిళనాడు ప్రభుత్వ అవార్డు అందుకున్న మహేంద్రన్ ప్రస్తుతం హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అవుతాయని ఆయన తెలిపారు. బాలనటుడిగా మంచి మార్కులు కొట్టేసిన మహేంద్రన్ మూడేళ్ల వయసు నుండే యాక్టింగ్ చేస్తున్నారు. 2009లో "మస్తానా మస్తానా" అనే డ్యాన్స్ షోలో పార్టిసిపెంట్‌గా కూడా పాల్గొన్నారు. 2013లో "విజా" అనే తమిళ చిత్రంలో హీరోగా నటించిన మహేంద్రన్.. ఆ తర్వాత ఓ తెలుగు చిత్రంలో కూడా నటించారు.
బాలనటులు దక్షిణాదిలో హీరోలుగా లక్ పరీక్షించుకోవడం కొత్తేమీ కాదు. కమల్ హాసన్ నుండి కళ్యాణ్ రామ్ వరకూ అందరూ బాలనటులుగా రాణించిన వారే. మనోజ్ నందం, తనీష్, బాలాదిత్య మొదలైన వారు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోలుగా హిట్స్ అందుకున్న వారే.