మలయాళంలో అనేక చిత్రాలలో విలన్‌గా నటించిన నటుడు కొల్లామ్ అజిత్ ఈ రోజు ఉదయం కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. 56 సంవత్సరాల కొల్లామ్ అజిత్ మలయాళంతో పాటు తమిళం, హిందీ, తెలుగు చిత్రాలలో కూడా నటించారు. దాదాపు 500 సినిమాల్లో నటించిన ఆయన 1984లో పరను పరను పరను అనే మలయాళ చిత్రంతో సినీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన కెరీర్‌లో ఎక్కువగా నెగటివ్ పాత్రలు పోషించిన కొల్లామ్ అజిత్ గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతికి మలయాళ చిత్ర పరిశ్రమ తన సంతాపాన్ని తెలియజేసింది. మోహనలాల్, ముమ్ముట్టి, మంజూ వారియర్ వంటి నటీనటులు అజిత్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.


కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తన సంతాపాన్ని తెలిపారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా కొల్లామ్ అజిత్ రెండు చిత్రాలు తీశారు. యువజనోత్సవం, నిర్ణయం, ఆరం థంపురన్‌, ఒలంపియన్ ఆంథోని యాడం, వల్లీత్తన్‌ మొదలైన హిట్ సినిమాల్లో నటించారు.