Salaar's Prithviraj Sukumaran Injured: మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. సినిమా షూటింగ్‌లో యాక్ష‌న్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన గాయపడ్డాడు. అతడికి సోమవారం వైద్యులు సర్జరీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం పృథ్వీరాజ్ 'విళ‌య‌త్ బుద్ధ' అనే మలయాళ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కేర‌ళ‌లోని మ‌ర‌యూర్‌లో జరుగుతుంది. ఇక్కడ యాక్ష‌న్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో పృథ్వీరాజ్ కాలికి గాయమైంది. దీంతో అతడిని కొచ్చిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయం పెద్దది కావడంతో  పృథ్వీరాజ్ కు డాక్టర్లు సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ శస్త్రచికిత్స తర్వాత రెండు నుంచి మూడు వారాల వ‌ర‌కు పృథ్వీరాజ్ షూటింగ్‌ల‌కు దూరంగా ఉండనున్నారు. 


పృథ్వీరాజ్ గాయం కావడంతో సలార్ టీమ్ టెన్షన్లో పడింది. ఎందుకంటే ఈ చిత్రంలో పృథ్వీరాజ్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. వ‌ర‌ద‌రాజా మ‌న్నార్ అనే గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో అత‌డు క‌నిపించ‌బోతున్నాడు. అయితే పృథ్వీరాజ్ కు సంబంధించిన కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పృథ్వీరాజ్ ప్రమాదం సలార్ మూవీ షూటింగ్ పై పడే అవకాశం ఉందని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 


మలయాళంతోపాటు టాలీవుడ్, బాలీవుడ్ లో మాంచి పాలోయింగ్ ఉన్న హీరోల్లో పృథ్వీరాజ్ ఒకరు. ఇతడు సలార్ తోపాటు ఓ బాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టిస్తోన్న భ‌డే మియా ఛోటా మియా సినిమాలో పృథ్వీరాజ్‌ కీలకపాత్ర చేస్తున్నాడు. మాలీవుడ్ లో ఇతడు హీరోగా నటిస్తోన్న ఆడుజీవితం సినిమా రిలీజ్ కు రెడీ అయింది. 


Also Read: Tamannaah Bhatia: ఫ్యాన్ చేసిన పనికి కంటతడి పెట్టుకున్న తమన్నా, వీడియో వైరల్


జయన్ నంబియార్ దర్శకత్వం వహించిన 'విలయత్ బుద్ధ' గంధపు చెట్టు యాజమాన్యంపై రెండు ప్రధాన పాత్రల మధ్య తలెత్తే వివాదం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో అను మోహన్ మరియు ప్రియంవద కృష్ణన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Also Read: Project K Cast Remuneration: 'ప్రాజెక్టు-కే' సినిమాకు ప్రభాస్, కమల్ హాసన్ లకు కళ్లు చెదిరే పారితోషికం.. ఎంతో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి