Man Kisses Lion: కొంతమంది దుస్సాహసం చేసి పాములను ముద్దాడిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. బుసలు కొట్టే నాగుపామును వాళ్లు ముద్దాడటం చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది కదా!! ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలా గూస్‌బంప్స్ తెప్పించే వీడియోనే. ఎప్పుడైనా ఎవరైనా సింహాన్ని ముద్దాడటం చూశారా ? సినిమాల్లో అలాంటి సీన్స్ చాలానే చూశాం అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే అవన్నీ రీల్ పై తెరకెక్కించినవి. అందులో రియాలిటీ ఉండదు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయేది మాత్రం రియల్ ఇన్సిడెంట్ గురించే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహాన్ని ఎవరైనా ముద్దాడటం ఎప్పుడూ చూడకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి. ఈ వీడియోను ఒకసారి చూస్తే.. కచ్చితంగా మరోసారి ప్లే చేసి చూడాలని అనిపించడం ఖాయం. ఎందుకంటే మనం చూసింది నిజమేనా అని ఆశ్చర్యపోతారు కనుక. మీ కళ్లను మీరే నమ్మలేకపోతారు. అంతలా ఈ వీడియోలో ఏముంది అని అనుకుంటున్నారా ? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరే స్వయంగా ఓ లుక్కేయండి. 



 


చూశారా ? వీడు మామూలోడు కాదురా బాబోయ్ అని అనిపించింది కదూ!! సింహాన్నే ముద్దాడిన ఆ వ్యక్తి సాహసం ఔరా అని అనిపించకమానదు. అడవిలో వేటాడే అతి క్రూరమైన జంతువును పిల్లిని చేతబట్టుకున్నట్టు పట్టుకుని దాని తల నిమురుతూ అక్కున చేర్చుకుంటున్న తీరు ఔరా అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే.. అంత పెద్ద సింహం కూడా అతడిని చూసి ఏమీ అనకుండా తల్లిని చూసి దగ్గరకు పోయినట్టే అతడి చేతుల్లోకి వెళ్లిపోయింది. తల్లి కౌగిట్లో చిన్నారి సేదతీరినట్టే అతడిని చూసి సింహం కూడా అంతే ఆనందంతో అతడిని సమీపించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ( Viral Video ) ఇప్పటికే 3 మిలియన్ల మంది వీక్షించారు.


జూలో సింహాల ఆలనాపాలనా చూసే వారికి మాత్రమే ఇలాంటి సాహసాలు సాధ్యపడతాయనే విషయం అందరికీ తెలిసిందే కదా. ఎందుకంటే ఎప్పటికప్పుడు సింహాల ఆకలి ఎరిగి నడుచుకోవడం, వాటి బాగోగులు చూస్తుంటారు కనుక అవి వాళ్లను చూసినప్పుడు ఏదో తెలియని వాత్సల్యాన్ని కనబరుస్తాయి. లేదంటే కొత్త సింహాలు ఎవరినైనా వేటాడి చంపేస్తాయి. వాటితో ఇలాంటి పనులు ప్రాణాలపై ఆశలు వదిలేసుకుని ముందడుగేయడమే అవుతుంది.


Also Read : King Cobra snake Video: ఒకే సారి లీటర్‌ నీళ్లు తాగిన పాము.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..


Also Read : Cobra Man Viral Video: బావిలో పడిన భారీ నాగుపాము.. ప్రాణాలకు తెగించి మరీ రక్షించిన యువకుడు! వావ్ అనకుండా ఉండలేరు


Also Read : Crocodile eating Crocodile: ఒక మొసలిని మరో మొసలి తినడం ఎప్పుడైనా చూశారా..? చూసి ఉండకపోతే ఇపుడు చూడండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook