డిఫరెంట్ రోల్స్ కు అంత్యత ప్రాధాన్యతను ఇచ్చే మంచు లక్ష్మీ మరో భిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ఆమె నటిస్తున్న 'w/o రామ్' సినిమాలో విభిన్నంగా కలిపించబోంది. థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో ఆమె 'దీక్ష' పాత్రలో కనిపించనుంది. మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టు ఈ రోజు రిలీజ్ చేశారు. బైక్ పై వెళుతూ ఏదో విషయాన్ని అన్వేషిస్తున్నట్టుగా ఈ పోస్టర్లో మంచు లక్ష్మి కనిపిస్తోంది. కాగా త్వరలోనే ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా లక్ష్మి మంచు క్రేజ్ ను మరింత పెంచడం ఖాయమనే టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని మంచులక్ష్మీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING