Manchu Vishnu trolled in Matti Kusthi Movie: ఒకప్పుడు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ సినిమాలు వేరువేరుగా ఉండేవి కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా బాగుంటే ఏ భాష సినిమా ఏ భాషలో అయినా హిట్ అవుతుంది. అందులో భాగంగానే తమిళంలో రూపొందించిన సినిమాలు తెలుగులో, తెలుగులో రూపొందించిన సినిమాలు తమిళం సహా ఇతర భాషల్లో ఇలా డబ్బింగ్ అయి రిలీజ్ అవుతున్నాయి. అదే విధంగా తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన మట్టి కుస్తీ అనే సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రవితేజ టీం వర్క్స్ బ్యానర్ మీద ఈ సినిమాని రవితేజ తెలుగులో రిలీజ్ చేశారు. విష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా ఈ సినిమా రూపొందింది. అజయ్, శత్రు వంటి వారు ఇతర కీలక పాత్రలలో రచించిన ఈ సినిమా డిసెంబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కుతోంది. నిజానికి కుస్తీ అనగానే అందరూ ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అనుకున్నారు కానీ నిజానికి ఆ బ్యాక్ డ్రాప్ కేవలం కొన్ని సీన్లలో మాత్రమే కనిపిస్తుంది.


సినిమా మొత్తం కామెడీతో రూపొందించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో మంచు విష్ణుని ట్రోల్ చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న సమయంలో ఆయన అనేక టీవీ చానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో ఒకసారి టంగుటూరి వీరేశం ప్రకాశం పంతులు అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు.


వాస్తవానికి టంగుటూరి ప్రకాశం పంతులు ఒక్కరే కానీ ఆయన కందుకూరి వీరేశలింగాన్ని టంగుటూరి ప్రకాశం పంతులుని కలిపి టంగుటూరి వీరేశం ప్రకాహం పంతులు అంటూ టంగ్ స్లిప్పయ్యాడు. అప్పట్లో ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. అయితే అనూహ్యంగా ఇదే పదంతో మరోసారి ఈ మట్టి కుస్తీ సినిమా ద్వారా మంచు విష్ణుని ట్రోల్ చేసినట్లయింది. ఒక ఊరి ప్రెసిడెంట్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వస్తుండగా అతనికి బెయిల్ ఇప్పించిన లాయర్ చేస్తా ఈ పదం వాడించారు.


అయితే ఈ విషయం యూనిట్ దృష్టికి వెళ్లిందో లేక డబ్బింగ్ పనులు చూసుకున్న తెలుగు డబ్బింగ్ ఇన్చార్జి వల్ల ఈ ట్రోల్ జరిగిందో తెలియదు కానీ ఈ వ్యవహారం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమాని రవితేజ దగ్గరుండి రిలీజ్ చేయడంతో రవితేజ దృష్టికి ఈ విషయం వెళ్లలేదా వెళ్లినా? లైట్ తీసుకున్నారా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశం మీద సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 


Also Read: HIT 2 Movie Review : హిట్‌ 2 రివ్యూ.. కోడి బుర్ర ఎవరిదంటే?


Also Read: Shraddha Murder Case: అఫ్తాబ్‌లో సూపర్ టాలెంట్.. జైలు అధికారులకే షాక్