Megastar Chiranjeevi to Recieve Award where he is Humilated: మెగాస్టార్ చిరంజీవి గతంలో తెలుగు సినిమాలకు ఎంత అవమానం జరిగిందనే విషయాన్ని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇటీవల కూడా ఒకటి రెండు సందర్భాలలో గతంలో తెలుగు సినిమాని భారతదేశ వ్యాప్తంగా ఎలా చూసేవారు అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలు గురించి మాత్రమే మాట్లాడే వారని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల గురించి అసలు ప్రస్తావనే ఉండేది కాదని ఆయన చెప్పుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో గోవా ఫిలిం ఫెస్టివల్ లో  తనకు ఎదురైన అవమానాన్ని కూడా ఆయన తెలుగు సినీ వజ్రోత్సవాల వేడుకలో బయటపెట్టారు. గోవా ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లిన తనకు మన తెలుగు సినీ ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వాళ్ళ ఫోటోలు అక్కడ కనిపించలేదని, ఇక ఇది మన గుర్తింపు అంటూ ఆయన అప్పుడు తెలుగు భాషకు, తెలుగు సినీ పరిశ్రమకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నారు. మనం బాంబే, ఢిల్లీ, గోవా వరకు కూడా వెళ్లలేకపోయాం.


ఎందుకలా ? అంటూ ప్రశ్నించిన ఆయన మనల్ని మనమే కించపరుచుకుంటూ మనలో మనమే గొడవలు పడుతూ ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇదంతా అప్పటి సంగతి. ఏ గోవా ఫిలిం ఫెస్టివల్ లో అయితే అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వంటి వాళ్ళ ఫోటోలు అలాగే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారి ఫోటోలు లేవని మెగాస్టార్ చిరంజీవి బాధపడ్డారో, అదే గోవా ఫిలిం ఫెస్టివల్ లో అత్యున్నత ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును ఆయన అందుకోబోతున్నారు.


ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ గానే చెప్పాలి. ఒకరకంగా ఇది చిరంజీవి ఒక్కరి అచీవ్ మెంట్ మాత్రమే కాదు, మన తెలుగు వారందరి అఛీవ్మెంట్. ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే అవమానం జరిగినట్లు మెగాస్టార్ భావించారో అక్కడే అత్యున్నత పురస్కారాన్ని అందుకోబోతున్నారని, ఆయన అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: Sujith: తంతే బూరెల బుట్టలో పడిన సుజిత్.. ఆ దర్శకుడి దెబ్బకు పవన్ నుంచి ఆహ్వానం!


Also Read: Hit 3: హిట్ 3 కోసం దిమ్మతిరిగే కాంబినేషన్ సెట్.. అడివి శేష్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook