Sujith: తంతే బూరెల బుట్టలో పడిన సుజిత్.. ఆ దర్శకుడి దెబ్బకు పవన్ నుంచి ఆహ్వానం!

Saaho Sujith Was Invited By Pawan Kalyan : సుజీత్ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కు కథ చెప్పినట్టు తెలుస్తోంది, కథ నచ్చడంతో పవన్ కళ్యాణ్ సుజీత్ ను లంచ్ మీటింగ్ కు పిలిచినట్టు చెబుతున్నారు. ఆ వివరాలు 

Last Updated : Nov 22, 2022, 03:29 PM IST
  • పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ సినిమా
  • డీవీవీ దానయ్య నిర్మాణంలో ప్రాజెక్ట్ సెట్
  • కథ వినిపించాక మళ్లీ పిలుపు
Sujith: తంతే బూరెల బుట్టలో పడిన సుజిత్.. ఆ దర్శకుడి దెబ్బకు పవన్ నుంచి ఆహ్వానం!

Saaho Sujith Was Invited By Pawan Kalyan for Lunch: కొందరు ఎంత త్వరగా తెరమీదకి వస్తారో, అంతే త్వరగా తెరమరుగు కూడా అయిపోతూ ఉంటారు. సాహో డైరెక్టర్ సుజిత్ అలాంటి కోవకు చెందిన వాడే. రన్ రాజా రన్ అనే ఒక సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఏకంగా రెండవ సినిమానే ప్రభాస్ తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. సాహో అనే సినిమా యు వి ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో జరిగే తెరకెక్కించారు సుజిత్.

కానీ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాట లేకపోయింది. తెలుగులో అయితే మరీ డిజాస్టర్ గా నిలవగా హిందీలో మాత్రం అక్కడి ప్రేక్షకులు ఆకట్టుకోవడమే గాక కొంతమేర వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది . అది నిజమే అని సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయడానికి డివీవీ దానయ్య రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ కు అన్ని విధాలుగా దగ్గరగా అంటూ ఒకరకంగా అండదండలుగా వ్యవహరిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సహచర్యం దొరకడంతో సుజిత్ కు ఈ సినిమా ఫైనల్ అవ్వడానికి పెద్ద సమయం పట్టలేదని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గైడెన్స్ లోని సుజిత్ కథ సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఈ కథని పవన్ కళ్యాణ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో డివివి దానయ్య చేస్తున్న కాంబినేషన్ సినిమా కథ ఫైనల్ అయినట్లు అని చెప్పొచ్చు.

ముందుగా కథ చెప్పేసి తన పని అయిపోయిందని వెనక్కి వచ్చేసిన సుజిత్ కి పవన్ కళ్యాణ్ నుంచి ఫోన్ వచ్చిందని హరిహర వీరమల్లు షూట్లో ఉన్నట్లుగా పేర్కొన్న పవన్ టీం అక్కడికే భోజనానికి రమ్మని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలా కొత్తగా సినిమాలు చేయబోయే దర్శకులను పిలిపించి లంచ్ మీటింగ్స్ పెట్టించడం మామూలే కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి చర్య ఊహించని సుజిత్ గాల్లో తేలిపోతున్నారట. ఎలా అయినా ఈ సినిమాతో హిట్టు అందుకుని మళ్ళీ టాలీవుడ్ లో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఆయన ఆశపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read:

Also Read:

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News