Ala Ila Ela: `అలా ఇలా ఎలా` పెద్ద విజయాన్ని సాధించాలి: మెలోడి బ్రహ్మ మణిశర్మ
ప్రముఖ డైరెక్టర్ పి వాసు తనయుడు శక్తి వాసుదేవ్ నటిస్తున్న సినిమా `అలా ఇలా ఎలా`. రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ సినిమా యూనిట్ ని విష్ చేశారు.
Ala Ila Ela: పి.వాసు కుమారుడు శక్తి వాసుదేవన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, నాగబాబు, పూర్ణ, రాజ్ శంకర్, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు.
'అలా ఇలా ఎలా' చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందించాడు. ఇప్పడికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ మరియు పాటలకు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఈ చిత్రం అన్ని కార్యక్రమాలని పూర్తీ చేసుకొని..ఎస్.కె.ఎం.ఎల్. మోషన్ పిక్చర్స్ సంస్థ ద్వారా జూలై 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
"సినిమాకి ముఖ్యం నిర్మాత.. నిర్మాత అనే వాడు ఒక వృక్షం.. నిర్మాతలు తీసే ఒక్కో సినిమా ద్వారా వందలాది మందికి ఉపాధి కలిపిస్తుంటారు.. నిర్మాతలని మనం కాపాడుకోవాలి. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉంటాయి. సిరివెన్నెల గారు మూడు పాటలు, భాస్కర భట్ల గారు ఒక పాటను రాశారు. ఇలాంటి పాటలను నేను ఇంత వరకు ప్రయోగించలేదు. రాఘవ మంచి దర్శకుడు.. సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. దర్శక- నిర్మాతలకి ఈ సినిమా మంచి సక్సెస్ అందించాలని.. జులై 21 న విడుదల కానున్న అలా ఇలా ఎలా సినిమా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేయాలని ఆకాంక్షిస్తున్న" అని మెలోడీ బ్రహ్మ మణిశర్మ పేర్కొన్నారు.
నటీనటులు :
శక్తి వాసుదేవన్, రాజా శేఖర్, పూర్ణ, షియాజీ షిండే, నాగబాబు, రియాజ్ ఖాన్, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి, హరిప్రియ, సితార, రేఖ, సీత తదితరులు
Also Read: Citroen New Car: సిట్రోయెన్ నుంచి మరో కొత్త కారు, హోండీ సిటీ, వెర్నాలను ఢీ కొట్టేనా
సాంకేతిక బృందం
నిర్మాత : కొల్లకుంట నాగరాజు
దర్శకుడు : రాఘవ
కెమెరా మాన్ : పి కె హెహ్ దాస్
సంగీతం : మణిశర్మ
యాక్షన్ డైరెక్టర్ : రాజశేఖర్
డాన్స్ మాస్టర్ : శోభి, అశోక్ రాజ్, నిక్సన్, గిరి, దిన
ఎడిటర్ : జాషి ఖ్మెర్
పీఆర్వో : సాయి సతీష్
Also Read: Nizamabad Crime: నిజామాబాద్ జిల్లాలో అక్కాచెల్లెళ్లు దారుణ హత్య.. ఏం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి