బీపీ మెషీన్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ మెషీన్లు వచ్చాయి. ఇప్పడు ఆ టెక్నాలజీకి కూడా కాలం చెల్లే సూచనలు కనిపిస్తున్నాయి. స్మార్టుఫోన్ ద్వారానే మీ బీపీ ఇక చెక్ చేసుకోవచ్చు. అలాంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు కొందరు సైంటిస్టులు. అవును.. ఈ టెక్నాలజీ గల స్మార్ట్ ఫోనులో ఓ యాప్‌ను డౌన్లోడ్ చేయడం వల్ల ఇది సాధ్యపడుతుంది. ఈ యాప్‌లో ఒక ఆప్టికల్ సెన్సార్ ఉంటుంది.


అలాగే స్మార్ట్ ఫోన్ వెనుక భాగాన మరో సెన్సార్ యూనిట్ ఉంటుంది. బీపీ చెక్ చేసుకోవాలని భావిస్తే.. తొలుత యాప్ ఆన్ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌కి ఎదురుగా గుండెను ఫోకస్ చేస్తూ.. వేలిని సెన్సార్ యూనిట్ పై ఉంచి నెమ్మదిగా నొక్కాలి. అలా వేలిని ఆనించగానే యాప్ బీపీ డేటాను రికార్డు చేస్తుంది. ఆ తర్వాత మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద బీపీ రీడింగ్ కనిపిస్తుంది. సెన్సార్ యూనిట్ పై వేలికొసను పెట్టినప్పుడు కలిగే ఒత్తిడిని ఆధారంగా చేసుకొని రీడింగ్ నమోదు అవుతుందని అంటున్నారు సైంటిస్టులు.