Music Director Sai Karthik: ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ నిర్మాతగా మారిపోయారు. డీమానిటైజేషన్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన '100 క్రోర్స్' మూవీకి సంగీత దర్శకత్వం వహిస్తూ దివిజా కార్తీక్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమాకు విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించగా.. ఎస్.ఎస్.స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందించారు. రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం తదితరులు కీలక పాత్రలు పోషించారు.  2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌ల ఆధారంగా కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దర్శకులు వీర శంకర్, మల్లిక్ రామ్, ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి, దామోదర ప్రసాద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Poco X6 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO X6 Pro 5G మొబైల్‌ను రూ.1,499కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!


ఈ సందర్భంగా దామోదర ప్రసాద్.. 100 క్రోర్స్ అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందని.. మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. సాయి కార్తీక్ సంగీతం అంటే తనకు చాలా ఇష్టం అని.. కన్నడ పరిశ్రమ నుంచి తెలుగులోకి వస్తున్న చేతన్‌కు స్వాగతమని హర్షిత్ రెడ్డి అన్నారు. డీమానిటైజేషన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని వీర శంకర్  అన్నారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకున్నారు.


డైరెక్టర్ మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. సాయి కార్తీక్‌కు అర్దరాత్రి ఫోన్ చేసి అడిగినా ట్యూన్స్ ఇస్తుంటారని.. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారని అన్నారు. చేతన్‌కు ఇది తెలుగులో ఫస్ట్ మూవీ అని.. ఈ మూవీ యూనిట్‌ను తెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ.. 2016లో జరిగిన యథార్థ కథ ఆధారంగా.. కరోనా తరువాత ఈ పాయింట్‌ను అనుకుని ప్రాజెక్ట్ చేశామని తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. చూసిన వాళ్లంతా బాగుందని అన్నారని చెప్పారు. సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉందన్నారు.


తెలుగు ఇండస్ట్రీలో హీరోగా వస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు హీరో చేతన్. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. సాయి కార్తీక్‌తో 15 ఏళ్లుగా తనకు అనుబంధం ఉందని.. ఆయన ఈ మూవీని నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తారని నమ్మకం ఉందన్నారు. ఈ సినిమాకు చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పనిచేయగా.. ఎస్.బీ.ఉద్దవ్ ఎడిటర్‌గా పనిచేశారు.  


Also Read: Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter