ఫస్ట్ సినిమా నుండి ఇప్పటి వరకు నాగ్ కెరీర్ లో లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్లు. సినిమా తాలూకు సక్సెస్ క్రేజ్ ని కాపాడుకోవాలనే ఆలోచన తప్ప.. ఇంతలా పర్టికులర్ సినిమాలపై ఎక్కడా ప్రేమను పెంచుకున్న దాఖలాలు కనిపించవు. ఇనేళ్ల సిరీ కెరీరో లో కానీ ఎక్కడా సీక్వెల్ గురించి ప్రస్తావించలేదు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నాగ్ ఆలోచన మారింది.. తన కెరీర్ లోనే హైలెట్ గా నిలిచిన బ్లాక్ బాస్టర్ మూవీస్ మన్మధుడు, బంగార్రాజు విషయంలో అంతులేని  ప్రేమను పెంచున్నాడు ..సీనీ కెరీర్‌‌లో సీక్వెల్స్ కూ దూరంగా ఉండే నాగ్ .. మన్మధుడు, బంగార్రాజు సీక్వెల్స్ తీయాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. మన్మధుడుపై ఉన్న మమకారంతో దీని సీక్వెల్ కి ఓకే అనేశాడు. ఇది చాలదన్నట్లు మరో సీక్వెల్ బంగార్రాజు కూడా సై అంటున్నాడు నాగ్. 


అన్ని సినిమాల్లాగే ఈ సినిమాలకు స్క్రిప్ట్  కంప్లీట్ గా లాక్ అయ్యాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ .. స్వయంగా తన బ్యానర్ లోనే నిర్మించాలని డిసైడ్ అయ్యాడు. ప్రతీది తన పర్యవేక్షణలో జరిగేలా చూస్తున్నాడు. దీన్ని బట్టి చూస్టుంటే నాగ్ ఈ మూవీ సీక్వెల్స్ పై ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నాడో అర్థౌమౌతంది..


రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘మన్మధుడు 2’ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనే ఒక్క విషయం తప్ప ఇంకా ఈ సినిమా గురించి ఏ విషయం రివీల్ కాలేదు. కానీ నాగ్ కాన్ఫిడెంట్ గా ఈ టైటిల్ సజెస్ట్ చేశాడంటే, సినిమాలో మ్యాటర్ కూడా అదే స్థాయిలో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.


ఇక ‘బంగార్రాజు’ విషయానికి వస్తే ఈ సినిమా ఎఫెక్ట్ జస్ట్ నాగ్ పైనే కాదు, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పై కూడా అంతే ఉంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తరవాత వచ్చిన 3 ఏళ్ల గ్యాప్ లో రవితేజ తో ‘నేల టికెట్’ అనే జస్ట్ ఒక్క సినిమా చేసి సరిపుచ్చుకున్నాడు. అప్పటి నుండి ఫోకస్ మొత్తం బంగార్రాజు పైనే ఉంది. ఏది ఏమైనా నాగార్జున ఫిక్సయితే చేసేస్తాడు అనేది ఎంత వాస్తవమో.. వర్కవుట్ అవుతుందనుకుంటేనే ఫిక్సవుతాడు అన్నది కూడా అంతే నిజం. మరి నాగ్ ఫార్మాల ఈ సారి ఏ స్థాయిలో హిట్టవుతందో చూడాలి మరి