Narudi Brathuku Natana First Look: ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస ప్రాజెక్ట్‌లను తెరకెక్కిస్తోంది. మంచి చిత్రాలను అందించే క్రమంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాను మన ముందుకు తీసుకొస్తోంది. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా కేరళలో జరిగింది. ఇక కేరళ ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Realme 12X 5G Price: రియల్‌మీ నుంచి అదిరిపోయే మొబైల్‌.. రూ.14,999లోపే ది బెస్ట్‌ Realme 12X 5G..  


నరుడి బ్రతుకు నటన సినిమాలో కేరళ అందాలే హైలెట్ కానున్నాయి. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ వంటి వారు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీని రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ గారు, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూఛిబొట్ల గారు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు.


నరుడి బ్రతుకు నటన గ్లింప్స్ చూస్తుంటే కేరళను అలా చుట్టి వచ్చినట్టుగా, మన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తోంది. నవ్వు, బాధ, ప్రేమ, స్నేహం ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఎంతో సహజంగా చూపించినట్టుగా అనిపిస్తోంది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.


==> రచయిత - దర్శకుడు: రిషికేశ్వర్ యోగి
==> నిర్మాతలు: టి.జి.విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా.సింధూ రెడ్డి
==> సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
==> DOP: ఫహద్ అబ్దుల్ మజీద్
==> సంగీత దర్శకుడు: NYX లోపెజ్
==> సాహిత్యం: చిత్రన్.ఎం, ఆదర్శ్ కుమార్ అనియల్
==> సౌండ్ డిజైనర్: రెంగనాథ్ రావే
==> సౌండ్ మిక్సింగ్: విపిన్ నాయర్, బోనీ ఎం జాయ్
==> ప్రాజెక్ట్ హెడ్: సుధీర్ కుమార్
==> ప్రాజెక్ట్ కంట్రోలర్: సుహైల్ వరట్టిపల్లియల్
==> PRO: సాయి సతీష్


Also Read: ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ‌విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత తక్కువ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook