తమిళ ఇండస్రీలో మహిళ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార... కెరీర్ తొలి నాళ్ల నుంచి  ఏనాడు ఖాళీగా లేదు. చంద్రముఖి మూవీతో ఆరంగేట్రం చేసిన నయన్  వరుస హిట్ లతో తమిళ సిటీ ఇండస్ట్రీతో ముకుటం లేని రాణిగా చలామణి అవుతూ వచ్చింది. తన కెరీర్ మొత్తంలో సినిమాలతో బీజీగా గడిపిన ముద్దుగుమ్మకు ఈ ఫీట్ అందుకోవడానికి 14 ఏళ్లు పట్టిందట.  ఇంతటీకీ ఏంటా ఫీట్ అనుకుంటున్నారా అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సౌత్ ఇండియ సూపర్ స్టార్ రజినీకాంత్ 'చంద్రముఖి' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది నయనతార. ఫస్ట్ సినిమాకే రజినీకాంత్ సినిమాలో చాన్స్ కొట్టేసినా  భావ ఎవరూ అనుకున్నారంతా... అప్పటి నుంచి నయన్  మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతగా సూపర్ స్టార్ ఇంపాక్ట్ పని చేసింది నయన్ సినిమా కరియర్ పై. కానీ  రజినీకాంత్ హీరోయిన్ అనిపించుకునే అవకాశమే మళ్ళీ నయనతారకి అంత ఈజీగా  రాలేదు.


ఎప్పుడో 2005 లో రిలీజయింది చంద్రముఖి సినిమా. ఆ తరవాత మళ్ళీ రజినీకాంత్ సినిమాలో అవకాశం దక్కలేదు. అప్పుడెప్పుడో కథానాయకుడు సినిమాలో నటించింది కానీ... కథాపరంగా ఆలోచిస్తే సినిమాలో రజినీకాంత్ సూపర్ స్టార్… ఆయన సినిమాలో నటించే హీరోయిన్ గా కనిపించింది నయన్. అంతేకానీ కథానాయకుడు సినిమాలో హీరోయిన్ నయనతార కాదు.


'శివాజీ' సినిమాలో కూడా కనిపించింది. కానీ జస్ట్ స్పెషల్ సాంగ్ వరకే అదృష్టం కలిసొచ్చింది. అప్పటి నుండి రజినీకాంత్, నయనతార జోడీపై ఫ్యాన్స్ లో డిమాండ్ క్రియేట్ అవుతున్నా, కథ…టైమ్ ఇలా ఏదో ఒకచోట మిస్ మ్యాచ్ అయి, ఈ కాంబినేషన్ తెరపైకి రాలేదు. ఇన్నాళ్ళకి ‘దర్బార్’ సినిమాతో కుదిరింది. ఈ సినిమాలో  రజినీకాంత్ సరసన కనిపించనుంది నయనతార. ‘చంద్రముఖి’ తరవాత మళ్ళీ రజినీకాంత్ హీరోయిన్ అనిపించుకోవడానికి 14 ఏళ్ళు పట్టింది నయనతారకి.