NBK 108 Movie Update: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింవర్గాల్లో చక్కెర్లు కొడుతోంది. బాలయ్య-అనిల్ కాంబోలో తెరకెక్కే మూవీ కోసం దాదాపు రూ. 80 కోట్లు ఖర్చు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఒక వేళ అదే నిజమైనట్లయితే అనిల్ రావిపూడి కెరీర్ లో ఇదే అతిపెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది. కథ మీద ఉన్న నమ్మకంతో ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడట్లేదు నిర్మాతలు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే రీసెంట్ గా ఈ ఎన్​బీకే 108 సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య (Balakrishna) లుక్ సరికొత్తగా ఉంది. ఈ చిత్రానికి తమన్​ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య 50 ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో కనిపించినున్నట్లు తెలుస్తోంది. ఆయన కూతురు పాత్రలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలల నటిస్తోంది. అయితే ఈ మూవీలో మరో ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ  సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 


బాలయ్య 108 చిత్రాన్ని వచ్చే  ఏడాది తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు 'ఐ డోంట్ కేర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఫిలిం సర్కిల్లో ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రాన్ని సాహు గార‌పాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. 


Also Read: Vijay Deverakonda Dating: అనన్య పాండేతో విజయ్ దేవరకొండ డేటింగ్.. ఆశీర్వదించిన 'రౌడీ హీరో' తల్లి! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook