Vijay Deverakonda Dating: అనన్య పాండేతో విజయ్ దేవరకొండ డేటింగ్.. ఆశీర్వదించిన 'రౌడీ హీరో' తల్లి!

Is Vijay Deverakonda dating with Ananya Panday. విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే డేటింగ్ చేస్తున్నారు? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 17, 2022, 06:48 PM IST
  • అనన్య పాండేతో విజయ్ దేవరకొండ డేటింగ్
  • ఆశీర్వదించిన 'రౌడీ హీరో' తల్లి
  • అమ్మ ప్రశాంతంగా నిద్రిస్తుంది
Vijay Deverakonda Dating: అనన్య పాండేతో విజయ్ దేవరకొండ డేటింగ్.. ఆశీర్వదించిన 'రౌడీ హీరో' తల్లి!

Is Vijay Deverakonda dating with Liger Actress Ananya Panday: టాలీవుడ్ యువ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్‌’. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఆగష్టు 25న లైగర్‌ సినిమా విడుదల కానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెందింది. 

లైగర్‌ ప్రమోషన్స్‌ కోసం విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే ఎంతో శ్రమిస్తున్నారు. దేశంలోని పలు పలు నగరాలను చుట్టేస్తూ.. బిజీబిజీగా గడుపుతున్నారు. విజయ్‌, అనన్య ఇప్పటికే పలు నగరాలను సందర్శించగా.. ఇంకా మరికొన్ని సందర్శించాల్సి ఉంది. దేశాన్ని చుట్టొస్తున్న కొడుకు సురక్షితంగా ఉండాలని పూజలు విజయ్‌ తల్లి మాధవి ప్రత్యేక పూజలు చేశారు. విజయ్‌ నివాసంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో లైగర్‌ హీరో హీరోయిన్ పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో వీరిద్దరికీ మాధవి రక్ష కట్టారు. 

తన బాగు కోసం తల్లి పూజలు నిర్వహించారని విజయ్‌ దేవరకొండ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'ఈ నెల మొత్తం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మీ ప్రేమాభిమానాన్ని పొందుతున్నా. ఇదంతా దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నా. అయినా కూడా ఆ దేవుడి రక్షణ మాకు ఎప్పటికీ ఉండాలని అమ్మ పూజ చేశారు. మా అందరికీ రక్ష కట్టారు. ఇక అమ్మ ప్రశాంతంగా నిద్రిస్తుంది. ఇక మేము మా పర్యటనను కొనసాగించవచ్చు' అని రౌడీ హీరో ట్వీట్ చేశాడు.

లైగర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్‌ దేవరకొండకు తరచుగా 'మీరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు' అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ ప్రశ్నకు విజయ్ ఏం సమాధానం చెప్పినా.. రష్మిక మందన్న పేరే నెటిజన్లు జపిస్తుంటారు. అయితే విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే కోసం రౌడీ హీరో తల్లి ప్రత్యేక పూజలు చేసి.. వీరిద్దరిని ఆశీర్వదించారు. దాంతో విజయ్‌, అనన్య డేటింగ్ చేస్తున్నారు? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం డేటింగ్ చేయడం లేదని అంటున్నారు.  

Also Read: ఈడు మగాడ్రా బుజ్జి.. 12 అడుగుల డేంజరస్ కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి! గూస్ బంప్స్ ఖాయం

Also Read: Assam: రూ.500 కోసం రగడ..ఓ వ్యక్తి దారుణ హత్య..ఘటన ఎక్కడ జరిగిందంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News