Kaliyugam Pattanamlo: కలియుగం పట్టణంలో మూవీ నుంచి `నీ వలనే` సాంగ్ విడుదల
Kaliyugam Pattanamlo Movie Updates: మార్చి 22న ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది ‘కలియుగం పట్టణంలో’. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడతో ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి `నీ వలనే` అంటూ సాగే ఈ మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Kaliyugam Pattanamlo Movie Updates: విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘కలియుగం పట్టణంలో’. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్‌పై డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మిస్తున్నారు. మార్చి 22న ఆడియన్స్ ముందుకు రానుంది. చిత్రా శుక్లా ప్రధాన పాత్రలో నటించారు. రీసెంట్‌గా విడుదల చేసిన మూవీ టీజర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. టీజర్‌తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. తాజాగా మూవీ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.
Also Read: ఊహించని గెటప్ లో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఆకట్టుకుంటున్న ది గోట్ లైఫ్ ట్రైలర్
'నీ వలనే' అంటూ సాగే ఈ మెలోడి సాంగ్‌కు ఎం.ఎం.మానసీ గాత్రం అందించారు. భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. అజయ్ అరసాద చక్కటి బాణీలు అందించారు. టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో మూవీ రాలేదని మేకర్స్ చెబుతున్నారు. సరికొత్త పాయింట్‌తో సినిమాను రూపొందించామని.. మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్స్, 'జో జో లాలీ అమ్మ' అనే సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నారు. జో జో లాలీ అమ్మ సాంగ్‌తో మూవీలో మదర్ సెంటిమెంట్ ఉంటుందని హింట్ ఇచ్చారు.
సాంకేతిక బృందం
==> డైరెక్టర్: రమాకాంత్ రెడ్డి
==> బ్యానర్: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
==> ప్రొడ్యూసర్స్: డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్
==> మ్యూజిక్ డైరెక్టర్ : అజయ్ అరసాద
==> కెమెరామెన్: చరణ్ మాధవనేని
==> సాహిత్యం: చంద్రబోస్, భాస్కర భట్ల
==> ఎడిటర్: గ్యారీ బీహెచ్
==> ఆర్ట్ డైరెక్టర్: రవి
==> స్టంట్స్: ప్రేమ్ సన్
==> కొరియోగ్రాఫర్ : మొయిన్ మాస్టర్
==> PRO: సాయి సతీష్, రాంబాబు
Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter