The Goat Life: ఊహించని గెటప్ లో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఆకట్టుకుంటున్న ది గోట్ లైఫ్ ట్రైలర్

The Goat Life Trailer:  సలార్ సినిమాతో మనందరినీ ఎంతగానో మెప్పించిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి సలార్ సినిమాలో ప్రభాస్ కి సమానంగా ప్రాధాన్యత సంపాదించుకున్నారు. ఇక ఈ హీరో ఇప్పుడు మరో పాన్ ఇండియా చిత్రంతో మనం ముందుకు రాబోతున్నాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2024, 08:08 PM IST
The Goat Life: ఊహించని గెటప్ లో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఆకట్టుకుంటున్న ది గోట్ లైఫ్ ట్రైలర్

Prudvi Raj Sukumaran:
పృథ్వీరాజ్ సుకుమారాన్ కి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అన్ని భాషల వారికి ఈ నటుడు సుపరిచితుడే. ముఖ్యంగా ఈ మధ్య విడుదలైన సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో సైతం ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

కాగా ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడు జీవితం). ఈ చిత్రం టీజర్.. పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈరోజు ఈ సినిమా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ ని అన్ని భాషలలో విడుదల చేశారు.

ఈ  సినిమా ట్రైలర్ చూసిన వారందరినీ ఆకట్టుకుంటోంది. "ది గోట్ లైఫ్" ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లే విధంగా సూపర్ టేకింగ్ తో ఈ ట్రైలర్ కట్ చేశారు. ఈ ట్రైలర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ వివిధ గెటప్స్ లో కనిపించిన తీరు, ఎడారి లొకేషన్స్, అద్భుతమైన విజువల్ క్యాప్షర్, హీరో క్యారెక్టర్ అయిన నజీబ్ జీవితంలోని భావోద్వేగాలను ఎంతో చక్కగా ఈ ట్రైలర్ లో చూపించారు.

ఇక ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు బ్లెస్సీ మాట్లాడుతూ - ‘నా దృష్టిలో ఈ సినిమా లాంటి గొప్ప సర్వైవల్ అడ్వెంచర్ సినిమా ఇప్పటివరకు వెండితెరపై రాలేదు. ఇలాంటి ఘటనలు ఒక వ్యక్తి జీవితంలో జరుగుతాయా అని ఆశ్చర్యపోతారు. చూసిన ప్రతి ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. 'మనకు ఎదురుకాని అనుభవాలన్నీ మిథ్యే అనుకుంటాం' అనేది ఈ సినిమాకు ఆధారమైన నవలలో ఒక ట్యాగ్ లైన్. ఈ చిత్రం టేకింగ్ కోసం మేము దాదాపు పదేళ్లు సమయం తీసుకున్నాం. తెరపై మేము ఆవిష్కరించబోతున్న కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం’ అని తెలియజేశారు.

హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ - ‘ఈ చిత్రం కోసం మా యూనిట్ మొత్తం చాలా కష్టమైన సుదీర్ఘ ప్రయాణం చేశాం. 10 సంవత్సరాల మా శ్రమ తర్వాత మా సినిమాను ప్రేక్షకులు తెరపై చూడబోతున్నారనే సంతోషం కలుగుతోంది. కోవిడ్ టైమ్ నుంచి మేమంతా అనుకోని, మర్చిపోలేని ప్రయాణం ఈ సినిమాతో చేశాం. బ్లెస్సీ అద్బుతమైన విజన్, ఆ విజన్ కు తన సంగీతంతో ఏఆర్ రెహమాన్ ప్రాణం పోశారు. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) మా దృష్టిలో కేవలం సినిమా మాత్రమే కాదు మా మనసుల్ని తాకిన ఒక గొప్ప కథ’.. అని చెప్పుకొచ్చారు.

 

Also Read: మెగా కాంపౌండ్ హీరోల కష్టాలు.. ఇక రంగంలోకి మెగాస్టార్ దిగాల్సిందేనా!

Also Read: బావ ఈజ్ బ్యాక్.. మిస్టర్ ఈగో చిందులు.. బెడ్‌రూం కంటే జైలు బెట్టర్ అంటున్న కల్యాణ్..

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News