Dachanna Darilo Thyagala Song: ఒక్క సాంగ్‌లో తెలంగాణ అమరవీరుల గొప్పతనం.. `దచ్చన్న దారిలో` త్యాగాల పాట
Telangana Formation Day: హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో దచ్చన దారిలో త్యాగాల పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను నేర్నాల కిషోర్ రూపొందించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ పాటను చక్కగా తెరకెక్కించారు.
Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్రం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో వేడులకను భారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావొస్తున్న సందర్భంగా నేర్నాల క్రియేషన్స్ బ్యానర్‌లో దచ్చన్న దారిలో అంటూ సాగే త్యాగాల పాటను షూట్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ పాటను రూపొందించారు. కాన్సెప్ట్, రచన, గానం, దర్శకత్వ బాధ్యతలు నేర్నాల కిషోర్ చూసుకున్నారు. ఈ సాంగ్‌లో 200 మందికి పైగా కళాకారులు యాక్ట్ చేశారు. ఈ సాంగ్‌ను కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కొత్తగట్టు, మొలంగూర్ గుట్టలపై చిత్రీకరించారు.
ఈ పాటలో ప్రత్యేక తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల ఆశయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ పాటలో దివంగత ప్రజా యుద్ధనౌక గద్దర్ వేషధారణలో ఏడీఎంఎస్ శివాజీ ఆకట్టుకున్నారు. ఈ సాంగ్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో రిలీజ్ చేశారు. నేర్నాల కిషోర్ మాట్లాడుతూ.. ఈ పాటను ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అమరుల కుటుంబాల చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేయించారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ, సినీ దర్శకులు ఎన్.శంకర్, హీరో సంజోష్, అరుణోదయ విమలక్క, విమల గద్దర్ (వెన్నెల) హాజరయ్యారు. ఈ పాటకు కొరియోగ్రఫీ, డీఓపీ శాంతిరాజ్ చేశారు.
కాగా.. దచ్చన్న దారిలో త్యాగాల పాట ఆవిష్కరణ సభలో స్వల్ప వివాదం చెలరేగింది. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్. జర్నలిస్టు పాశం యాదగిరికి మధ్య గొడవ జరిగింది. సభలో మాట్లాడుతుండగా.. మహేశ్ కుమార్ గౌడ్ చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు పాశం యాదగిరి. జూన్ 2న జరిగే సన్మాన కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దన్నారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గీతంగా కవి అందెశ్రీ రాసిన 'జయ జయహే తెలంగాణ'ను ప్రకటించనున్నారు. అదేవిధంగా స్వల్ప మార్పులతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ గీతానికి స్వరాలు అందించారు.
Also Read: Police Lathi Charge: రైతులపై లాఠీచార్జ్ చేయడమే మార్పా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter