ఈ వీకెండ్లో సందడి చేసే తెలుగు సినిమాలివే
ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత, దాంతో పాటు గతవారం రిలీజైన పందెం కోడి 2, హలో గురూ ప్రేమకోసమే సినిమాల స్పీడ్ ఇంకా తగ్గనే లేదు అప్పుడే రాబోయే వీకెండ్ బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి మరో కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ విశేషాలు మీకోసం..!
ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత, దాంతో పాటు గతవారం రిలీజైన పందెం కోడి 2, హలో గురూ ప్రేమకోసమే సినిమాల స్పీడ్ ఇంకా తగ్గనే లేదు అప్పుడే రాబోయే వీకెండ్ బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి మరో కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ విశేషాలు మీకోసం..!
వీర భోగ వసంత రాయలు : నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియ శరన్ నటించిన డిఫెరెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ ‘వీర భోగ వసంత రాయలు’. ఇప్పటికే ట్రైలర్‌తో క్యూరియాసిటీ రేజ్ చేసిన ఈ సినిమా ఈ నెల 26న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి కె. ఇంద్రసేన దర్శకత్వం వహించారు.
ఐశ్వర్యాభిమస్తు : ఆర్య, తమన్నా జంటగా నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా ‘వసువుం సరవనుం ఒన్న పడిచవంగ’. ఈ సినిమాని తెలుగులో ‘ఐశ్వర్యాభిమస్తు’గా ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో విశాల్ పోలీసాఫీసర్‌గా కామియో రోల్ ప్లే చేశాడు. ఎం. రాజేష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగులో ఏ రేంజ్‌లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.
రథం: గీత ఆనంద్, చాందిని జంటగా నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ రథం. చంద్రశేఖర్ కానూరి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 26 తేదిన రిలీజవుతుంది. ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్, యూత్‌ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది. సుకుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
భాగ్యనగరం: కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ‘రాజధాని’ సినిమా, తెలుగులో ‘భాగ్యనగరం’ గా ఈ నెల 26 తేదిన రిలీజవుతుంది. యష్, షీనా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీ రోల్ ప్లే చేశాడు. మాదక ద్రవ్యాలు, మద్యపానం వీటి మధ్య ఇన్నోసెంట్ యూత్ ఎలా వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా, తెలుగులో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.