నెక్ట్స్ ఏంటి ట్రైలర్
నెక్ట్స్ ఏంటి ట్రైలర్
సందీప్ కిషన్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నెక్ట్ ఏంటి సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో తాజాగా ఆ చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. బాలీవుడ్‌లో ఫనా, హమ్ తుమ్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన కునాల్ కోహ్లీ ఈ సినిమాను రూపొందించాడు. కునాల్ కోహ్లీకి ఇదే మొదటి తెలుగు సినిమా కాగా.. అసలు టాలీవుడ్ చరిత్రలోనే ఓ బాలీవుడ్ డైరెక్టర్ నేరుగా తెలుగు సినిమాను డైరెక్ట్ చేయడం ఇదే తొలిసారి అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. రైనా జోషి, అక్షయ్ పురి నిర్మించిన ఈ సినిమాలో నవదీప్ మరో ప్రధాన పాత్ర పోషించాడు.