‘నోటా’ తొలి పాట టీజర్ అదుర్స్
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో సత్తా చాటిన యువ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో... మెహరీన్ కథానాయికగా నటిస్తున్నారు.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో సత్తా చాటిన యువ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో... మెహరీన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ రోజే ఈ చిత్రంలోని తొలి గీతాన్ని టీజర్ రూపంలో కథానాయకుడు విజయ్ దేవరకొండ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘చిత్రం విడుదల తేదీని మనమంతా పండగలా జరుపుకుందాం. ఆ రోజూ మిమ్మల్ని నేను థియేటర్ వద్ద కలుస్తాను. మీ కోసమే ‘షాట్ నంబర్’ గీతాన్ని రిలీజ్ చేస్తున్నాం’ అని విజయ్ ట్వీట్ చేశారు.
ఈ ప్రత్యేక గీతంలో విజయ్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించడం గమనార్హం. గ్రీన్ స్టూడియోస్ బ్యానరుపై ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తుండగా.. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని అక్టోబర్ 5వ తేదిన విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ అనే మరో సినిమాకి కూడా సైన్ చేశారు. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంతో పాటు విజయ్ ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కూడా అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే విజయ్ నటించిన "గీత గోవిందం" చిత్రం పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. 2012లో వచ్చిన "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" సినిమాలో చాలా చిన్న పాత్ర పోషించిన విజయ్.. 2015లో విడుదలైన "ఎవడే సుబ్రహ్మణ్యం" సినిమాలో రిషి పాత్రతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.