టాలీవుడ్ కింగ్స్  రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న RRR సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ బయటకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ లీక్ అయింది. ఇప్పటి వరకు కథ, క్యారెక్టర్స్ గురించి మాత్రమే లీక్ చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు తాజాగా పాటల సంబంధించిన లీక్ ఇచ్చారు. భారీ అంచనాలతో తెరపైకి వస్తున్న ఈ మూవీలో మూడు పాటలు మాత్రమే ఉంటాయట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాలో చరణ్ పై ఓ డ్యూయట్, ఎన్టీఆర్ పై మరో డ్యూయట్ ఉంటుందట. ఇక మూడో పాటను ఎన్టీఆర్-చరణ్ పై జాయింట్ గా తీస్తారట. వీటితో పాటు ఓ నాలుగో సాంగ్ కూడా ఉందట. కాకపోతే అది మాంటేజ్ సాంగ్. ప్రస్తుతం RRRపై నడుస్తున్న లేటెస్ట్ రూమర్ ఇదే. 


బాహుబలి టైపులో కాకుండా ఈ సినిమాను తక్కువ రన్ టైమ్ లో పూర్తిచేయబోతున్నారు. పైగా పాన్-ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా అన్ని భాషల్లో ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలా పాటల్ని కుదించారట. 


వాస్తవానికి ఈ మూవీకైనా పాటలే ప్రాణం పోస్తాయి. అలాంటిది అతి తక్కువ పాటలతో RRR తెరపైకి ఎక్కడం నిజంగా కొంత డేర్ తో కూడిన విషమయే.. ఈ నేపథ్యంలో మూడు పాటలతో ఆడియన్స్ ఏ మేరకు కన్విన్స్ చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది.