హైదరాబాద్: చింపాజీల గుంపు భయపడతూ ఓ ప్రదేశానికి చేరుకొని నక్కి ఒకదానిని ఒకటి గట్టిగా పట్టుకొని భయంగా చూస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో విచ్చలవిడిగా వైరల్ అవుతోంది. దట్టమైన దండాకారణ్యంలో ఓ అనాథ చింపాజీల గుంపుకు దారి మధ్యలో ఒక తెల్లని కవర్ కనిపించడంతో అందులో ఒకటి ముందుకు వెళ్లి ఆ కవర్‌ను తీయగా.. దానికింద ఒక రబ్బరు పాము కనిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

 అది చూసిన వెంటనే వెనకున్న మిగితా చింపాజీల వద్దకు పరుగెత్తుకెళ్లింది. చింపాజీలన్నీ ఆ రబ్బరు పామును చూసి మనుషుల లాగానే భయపడిపోతూ ఒకదానినొకటి గట్టిగా ఒకదానికొకటి కౌగిలించుకుని చూస్తున్నదీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘అనాథ చింపాజీల గుంపు.. అడవిలోని పాములకు భయపడటాన్ని పిల్ల చింపాజీలకు నేర్పుతున్నాయని’ క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఈ ఫన్నీ వీడియో వైరల్ గా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..