హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి వరుస చిత్రాలతో బిజీ అయిపోనున్నారని, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తన అభిమానులకు శుభవార్త ఆందిచారు. 3 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్, మరొక  ఆసక్తికరమైన చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తాడని సినీ వర్గాలు తెలిపాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పవర్ స్టార్ రెండో ఇన్నింగ్స్‌లో తన మొదటి ప్రాజెక్ట్‌గా పింక్ రీమేక్‌తో రావాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నట్లుగా తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, పవర్ స్టార్ పొందిన మూడు చిత్రాల వివరాలు వెలువడడంతో అభిమానులు ఆనందోత్సహాలతో మునిగి తేలుతున్నారు. 


తదుపరి పీరియడ్ చిత్రం క్రిష్ దర్శకత్వంలో చేయనుండగా, మరో చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని తెలిపారు. ఆసక్తికరమైన అంశమేమిటంటే, మూడు చిత్రాలు  వచ్చే రెండు సంవత్సరాల్లో (2020,2021) గ్రాండ్ రిలీజ్ అవుతాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో, పవన్ కళ్యాణ్ మరో రెండు ప్రాజెక్టులపై సంతకం చేయాలనుకుంటున్నట్లు సమాచారం.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..