అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దేవాలయంలో రథం దగ్ధమైన ఘటనపై ( Antarvedi temple radham issue ) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. మొన్న పిఠాపురం, కొండబిట్రగుంట ఇప్పుడు అంతర్వేది... ఈ ఘటనలన్నీ యాదృచ్ఛికాలు కావు అని పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) వ్యాఖ్యానించారు. ఇలా ఇంకెన్నిరథాలు దగ్ధం అవ్వడం... విగ్రహాల ధ్వంసం ( Goddess Idols vandalised ) అవ్వడం వంటి ఘటనలను యాదృశ్చికంగా జరిగిన ఘటనలుగా ప్రభుత్వం చెబుతుందని ప్రశ్నిస్తూ ఏపీ ప్రభుత్వంపై ( AP govt ) పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మతిస్థిమితం లేనివారి పని, తేనె పట్టు కోసం చేసిన పని అని చెబుతుంటే పిల్లలు కూడా నవ్వుతారని అసహనం వ్యక్తంచేశారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసమైనప్పుడే సరైన రీతిలో స్పందించి ఉండుంటే ఇప్పుడు ఈ ఘటనలు పునరావృతమయ్యేవా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. Also read : Antarvedi temple issue: రధం దగ్దంపై ప్రభుత్వం సీరియస్..ఈవో సస్పెన్షన్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఏపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ).. పోలీసుల దర్యాప్తుపై ప్రజలకు నమ్మకం లేదని, ఈ విషయంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని సర్కారుని డిమాండ్ చేశారు. ఒకవేళ వైసిపి ప్రభుత్వం స్పందించకుంటే సీబీఐ దర్యాప్తు ( CBI probe ) కోసం కేంద్రాన్ని కోరతామని చెప్పిన పవన్.. ఉగ్రవాద కోణం ఉన్నట్టయితే ఎన్ఐఏ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. Also read : Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ ఎవరో తెలుసా ?


ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై రాష్ట్రంలోని ఆడపడుచులు అందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ నిరసన తెలపాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఇతర మతాల పెద్దలు సైతం ఈ తరహా ఘటనలను ఖండించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. Also read : Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్ 4 షోలో‌కి ఎట్లొచ్చింది ?