ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ వాయిదా నగదు కోసం కోట్లాదిమంది రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందే 2 వేల రూపాయలు పొందాలంటే ఓ అతి ముఖ్యమైన సూచన ఉంది. జనవరి నెలలోనే 13వ వాయిదా డబ్బులు రైతుల ఖాతాల్లో బదిలీ కానున్నాయి. జనవరి 28వ తేదీ అత్యంత కీలకమైనది కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర వ్యవసాయ శాఖ ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించింది. లబ్దిదారులైన అన్నదాతలకు 28వ తేదీ జనవరి 2023లోగా కీలకమైన ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించాల్సి ఉందని వ్యవశాయ శాఖ తెలిపింది. ఈ కేవైసీ చేయించని అన్నదాతలకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం వర్తించదు. రైతులకు 13వ విడత నగదు త్వరలోనే లభించవచ్చు.


ఈ కేవైసీ చేయించని లక్షలాది రైతులు


బీహార్ ప్రభుత్వం ఇప్పటికే రైతాంగానికి పలు సూచనలు జారీ చేసింది. ప్రదాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్దిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఇంకా 16.74 లక్షలమంది రైతులు ఈ కేవైసీ చేయించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎస్ఎంఎస్ కూడా ఆయా రైతులకు పంపించారు. 


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు రావచ్చు


మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం ఇవాళ అంటే జనవరి 23 లేదా జనవరి 26వ తేదీన రైతుల ఖాతాల్లో డబ్బులు బదిలీ చేయవచ్చు. ఇప్పటివరకూ ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఏ విధమైన అధికారిక ప్రకటన లేదు. కానీ జనవరి 28 వరకూ మాత్రం ఈకేవైసీ పూర్తి చేయాలి. 


మీ వాయిదా స్టేటస్ చెక్ ఇలా


మీ వాయిదా స్టేటస్ చెక్ చేసేందుకు పీఎం కిసాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫార్మర్స్ కార్నర్ క్లిక్ చేయాలి. ఆ తరువాత బెనిఫిషియరీ స్టేటస్ ఆఫ్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత మీ స్టేటస్ అక్కడ లభిస్తుంది. 


పీఎం కిసాన్ పథకంపై ఫిర్యాదులు


ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు సంప్రదించాలి. అది కాకుండా pmkisan-ict@gov.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. 


Also read: Post office Schemes: అత్యధిక వడ్డీ, జీరో రిస్క్, ట్యాక్స్ మినహాయింపు ఇచ్చే 5 పోస్టాఫీసు పథకాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook