Thalapathy Vijay lands in legal trouble: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్- యాక్షన్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'లియో'. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. వీరిద్దరూ దాదాపు 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ వాసుదేవ మేనన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజైన ఫస్టు లక్, సాంగ్ అభిమానులు ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ టీమ్ చిక్కుల్లో పడింది. అదేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్ 22న ఈ మూవీ నుంచి 'నా రెడీ' (Naa Ready) అనే పాట విడుదలై.. యూట్యూబ్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ పాట వల్ల మూవీ టీమ్ చిక్కుల్లో పడింది. ఈ సాంగ్ లో డ్రగ్స్ వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారని ఆర్టీఐ. సెల్వం అనే సామాజిక కార్యకర్త కోర్టును ఆశ్రయించారు. హీరో విజయ్ , మిగతా చిత్రబృందంపై ఈయన ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ కింద వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 



ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నా రెడీ పాటను హీరో విజయ్-అనిరుధ్ ఇద్దరూ కలిసి పాడారు. ఈ సాంగ్ కు విష్ణు ఎడవన్ లిరిక్స్ అందించారు. దళపతి ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఈ సాంగ్ ను తెరకెక్కించారు. నోటో బీడీ పెట్టుకుని విజయ్ మాస్ స్టెప్పులతో ఇరగదీశాడు. గత కొన్ని రోజులు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా కాశ్మీర్ లో ఓ భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నారు. 


Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి