కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించనున్న ప్రభాస్
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పూర్తి స్థాయి ప్రేమ కథాంశంతో రానున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్‌తో కలిసి ప్రభాస్ సొంత బ్యానర్ గోపి కృష్ణ మూవీస్‌లో ఈ జాయింట్ వెంచర్ తెరకెక్కనుంది. ఈ సినిమాను కృష్ణం రాజు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ కొండలనెక్కనున్నాడని టాక్. హీరోయిన్ కోసం కొండకోనల్లో అన్వేషణ చేస్తూ ఆయన ముందుకే సాగే సన్నివేశాలు వుంటాయనీ.. ఇవే సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాల సమాచారం. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం యూరప్‌లో ప్లాన్ చేశారు. ఇందులో ప్రభాస్ ఆస్ట్రాలజిస్ట్‌గా కనిపిస్తారని టాక్. 2019 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కుతోంది.
కాగా ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్ హైదరాబాద్‌లో నిర్విరామంగా జరుగుతున్న విషయం తెలిసిందే! సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తుంది. ‘సాహో’ షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలం అయ్యింది. కానీ ఈ సినిమా రిలీజ్‌కు మరికొంత సమయం పడుతుందని సమాచారం. పైగా ఈ సినిమాలో గ్రాఫికల్ వర్క్స్ ఎక్కువగా ఉందట. దీంతో ఆగస్టులో రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా లాంచ్ చెయ్యడానికి రెడీ అయిపోయాడు డార్లింగ్ 'ప్రభాస్'.