Post Office Scheme: ఈ స్కీమ్‌లో రోజుకు రూ.50 చెల్లిస్తే చాలు.. రూ.35 లక్షలు మీ సొంతమవుతాయి..
Post Office Gram Suraksha Yojana: గ్రామీణ ప్రాంత ప్రజల కోసం పోస్టాఫీస్‌లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఆ స్కీమ్ వివరాలు, బెనిఫిట్స్ ఇక్కడ తెలుసుకోండి.
Post Office Gram Suraksha Yojana: భవిష్యత్ భద్రంగా ఉండాలంటే ఆర్థిక ముందుచూపు అవసరం. అలాగని రిస్క్‌తో కూడిన పెట్టుబడులు పెడితే భవిష్యత్‌ను కూడా రిస్క్‌లో పెట్టినట్లవుతుంది. ముఖ్యంగా చిన్న మొత్తంలో దీర్ఘకాలం పొదుపు చేయాలనుకునే సామాన్య, మధ్య తరగతి ప్రజలు రిస్క్ ఫ్రీ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటి రిస్క్ ఫ్రీ స్కీమ్స్‌కి ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. పోస్టాఫీస్‌లో చిన్న మొత్తంలో దీర్ఘకాలం పొదుపు చేసుకునేందుకు పలు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో పోస్టాఫీస్ గ్రామ సురక్ష యోజన స్కీమ్ ఒకటి.
పోస్టాఫీస్ గ్రామ సురక్ష యోజన : ఎవరు అర్హులు, బెనిఫిట్స్ ఏంటి..
ఈ పథకానికి కనీస అర్హత వయసు 19 ఏళ్లు. గరిష్ఠ వయసు 55 ఏళ్లు.
కనీస మొత్తం రూ.10 వేలు, గరిష్ఠ మొత్తం రూ.10 లక్షలు
నాలుగేళ్ల తర్వాత రుణ సదుపాయం పొందే అవకాశం
ఐదేళ్ల కన్నా ముందే స్కీమ్‌ను వీడినట్లయితే బోనస్ వర్తించదు.
పాలసీదారుడు 59 ఏళ్ల వయసు వరకు పాలసీని ఎండోమెంట్ అసూరెన్స్ పాలసీగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
ప్రీమియం చెల్లింపు నిలిచిపోయిన ఏడాది వరకు లేదా మెచ్యూరిటీ నిండిన ఏడాది లోపు ఎండోమెంట్ అసూరెన్స్ పాలసీగా మార్చుకునే అవకాశం ఉండదు.
ఈ పాలసీ ద్వారా 55, 58, 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించవచ్చు.
ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ.1000కి రూ.60 బోనస్‌గా ఉంది. ఒకవేళ మెచ్యూరిటీ కన్నా ముందే పాలసీని సరెండర్ చేస్తే.. తక్కువ మొత్తంలో బోనస్ లభిస్తుంది.
రోజుకు కేవలం రూ.50తో రూ.35 లక్షల రిటర్న్స్ :
గ్రామీణ సురక్ష యోజన పథకం కింద పాలసీదారుడు రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షల రిటర్న్స్ పొందవచ్చు. రోజుకు రూ.50 అంటే.. నెలకు రూ.1515 అవుతుంది. 55 ఏళ్ల టర్మ్‌కి పాలసీ కట్టినట్లయితే మెచ్యూరిటీ నాటికి రూ.10 లక్షలు అవుతుంది. కానీ బెనిఫిట్స్‌తో కలుపుకుని పాలసీదారుడికి మొత్తం రూ.31,60,000అందుతుంది. అదే 60 ఏళ్ల టర్మ్‌కి పాలసీ చెల్లించినట్లయితే బెనిఫిట్స్‌తో కలుపుకుని మెచ్యూరిటీ నాటికి రూ.34.60 లక్షలు పొందుతారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం తీసుకొచ్చిన ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది.
Also Read: Post Office Scheme: కేవలం రూ.417 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.1 కోటి సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసా..
Also Read: Post Office Scheme: ప్రతీ నెలా రూ.2500 పొందే మార్గం.. పోస్టాఫీస్‌లో ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.