Post Office Scheme: రిస్క్ లేని పెట్టుబడికి, అధిక మొత్తంలో రాబడికి మధ్యతరగతి వారి బెస్ట్ ఛాయిస్ 'పోస్టాఫీస్ స్కీమ్స్'. బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీస్‌లోనే వడ్డీ రేటు ఎక్కువ. ప్రస్తుతం పోస్టాఫీస్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.6 శాతం వడ్డీ రేటు ఉంది. చాలా బ్యాంకుల్లో ఇది 6 శాతానికి లోపే ఉంది. కాబట్టి చాలామంది మధ్యతరగతి ప్రజలు పోస్టాఫీస్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
పోస్టాఫీస్‌లో ఎంఐఎస్ స్కీమ్ :
పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్‌లో ఎంఐఎస్ (మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్-నెలవారీ ఆదాయం పొందే పథకం) ఒకటి. ఈ స్కీమ్ కింద మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే నెలవారీ వడ్డీ పొందవచ్చు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు వడ్డీ రేటు ఎంత ఉంటుందో.. ఎఫ్‌డీ టెన్యూర్ ముగిసేంతవరకూ అదే వడ్డీ రేటు వర్తిస్తుంది. అంటే.. మధ్యలో వడ్డీ రేటు తగ్గినా, పెరిగినా ఆ ప్రభావం దీనిపై పడదు. కాబట్టి ఖాతాదారులు వడ్డీ రేటు తగ్గుతుందేమోనని బాధపడాల్సిన పని లేదు.
ఎంఐఎస్ స్కీమ్‌లో ఎవరు, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు:
పోస్టాఫీస్‌లో రూ.1 వెయ్యి చెల్లిస్తే ఎంఐఎస్ ఖాతా తెరుస్తారు. మైనర్లయిన పిల్లల పేరిట వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవవచ్చు. పదేళ్లు పైబడిన మైనర్లు స్వంతంగా ఖాతా తెరవవచ్చు. ఈ స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు తల్లిదండ్రులు తమ పిల్లల నెలవారీ స్కూల్ ఫీజులు చెల్లించేందుకు ఉపయోగించుకోవచ్చు. సింగిల్ అకౌంట్ అయితే గరిష్ఠంగా రూ.4.5 లక్షలు వరకు, జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
నెలకు రూ.2475 పొందండిలా :
ఎంఐఎస్ స్కీమ్‌లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే నెలకు రూ.1100 వడ్డీ లభిస్తుంది. ఒకవేళ మీరు రూ.4.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల రూ.2,475 వడ్డీ రూపంలో పొందవచ్చు. అయితే దీనిపై కొంత పన్ను విధించబడుతుంది. ఎంఐఎస్ స్కీమ్‌లో గరిష్ఠంగా ఐదేళ్ల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయవచ్చు. మెచ్యూరిటీ పూర్తయ్యేంతవరకూ ప్రతీ నెలా వడ్డీ పొందుతారు.
Also Read: Kcr Shock: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కార్పొరేషన్ మేయర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Post Office Scheme: ప్రతీ నెలా రూ.2500 పొందే మార్గం.. పోస్టాఫీస్‌లో ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా..
పోస్టాఫీస్ ఎంఐఎస్ స్కీమ్
వడ్డీ రూపంలో నెలవారీ ఆదాయం పొందే మార్గం
నెలకు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో ఇక్కడ తెలుసుకోండి