Puneeth Rajkumar Health: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుకు (Puneeth Rajkumar Heart Attack) గురైనట్లు శాండిల్ వుడ్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం గుండెపోటుకు గురైన ఆయన్ని.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని.. మరికొద్ది గంటల్లో హెల్త్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సదరు ఆస్పత్రి వైద్యులు తెలుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ ఆస్పత్రి (Puneeth Rajkumar Hospitalized) చేరడం పట్ల ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన హీరో పునీత్ రాజ్ కుమార్ కు ఈసీజీ పరీక్షలను వైద్యులు నిర్వహించారని సమాచారం. పునీత్ రాజ్ కుమార్ జిమ్లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా (Puneeth Rajkumar Health) ఉందని తెలపడంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ ఆరోగ్య పరిస్థితిపై కన్నడ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. 


పునీత్ రాజ్ కుమార్ చివరిగా ’యువరత్న’ అనే సినిమాలో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ’జేమ్స్ అండ్ ద్విత్వ’ సినిమాలో (Puneeth Rajkumar New Movie) పునీత్ నటిస్తున్నారు.


Also Read: Director Ajay Bhupathi says Sorry: క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌ భూపతి


Also Read: Rajinikanth Hospitalized: ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్.. ఆరోగ్యంగానే ఉన్నారంటున్న కుటుంబసభ్యులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook