Rajinikanth Hospitalized: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. ఏటా నిర్వహించే సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లారని.. ఆయన ఆరోగ్యంగానే (Rajinikanth Health) ఉన్నారని రజనీ సతీమణి లతా తెలిపారు. రెండ్రోజుల క్రితం దిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్ (Rajinikanth News).. బుధవారం రాత్రి తాను నటించిన ‘అన్నాత్తే’ చిత్రాన్ని (Annaatthe Release Date) కుటుంబ సభ్యుల మధ్య వీక్షించారు. గురువారం సాయంత్రం ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. విషయం బయటకు పొక్కడం వల్ల రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ స్పందించారు.
“రజనీకాంత్ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే’’ అని లతా రజనీకాంత్ పేర్కొన్నారు.
ఆస్పత్రికి వెళ్లిన కొన్ని గంటల తర్వాత రజనీకాంత్ (Rajinikanth News) ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు. అయితే శుక్రవారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో (Rajinikanth Hospitalized) చేరారనే ప్రచారమూ జరిగింది. గురువారం రాత్రి రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన కుమార్తె ఐశ్వర్య కావేరి ఆస్పత్రికి వచ్చారు.
Also Read: Bheemla Nayak heroine: ఐశ్వర్య రాజేష్ ఔట్.. Samyukta Menon ఎంట్రీ కన్ఫామ్
Also Read: Aryan Khan in Drugs Case: 25 రోజుల తరువాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Rajinikanth Hospitalized: ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్.. ఎందుకంటే..