సంచలనం సృష్టిస్తున్న వకీల్ సాబ్...
సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ క్రేజీ సంపాదించిందని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సినీ పున:ప్రవేశ చిత్రం అదిరిపోయిందని,
హైదరాబాద్: సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ క్రేజీ సంపాదించిందని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సినీ పున:ప్రవేశ చిత్రం అదిరిపోయిందని, చిత్ర టైటిల్ మంగళవారం ఆవిష్కరించబడ్డ సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ చిత్రం తెలుగులో ‘వకీల్ సాబ్’ రూపంలో రీమేక్ గా రాబోతుంది. వకీల్ సాబ్ చిత్రాన్ని రామ్ శిరీష్ లు సంయక్తంగా నిర్మిస్తుండగా, శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.
అభిమానులు, నెటిజన్లతో పాటు, అర్జున్ కపూర్, జాన్వి కపూర్లతో సహా సినీ ప్రముఖుల స్ట్రింగ్ సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ ను ప్రశంసిచారు. కాగా వకీల్ సాబ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టింది. మూవీ మేకర్స్ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం, పోస్టు చేసిన మొదటి 24 గంటల్లో అత్యధిక రీట్వీట్ చేసిన ఫస్ట్ లుక్ (25.3 కె) గా అవతరించిందని, అలాగే, విడుదల రోజున భారతదేశంలో అత్యధిక టైటిల్ ట్యాగ్ ట్వీట్లను(3.5m) వకీల్ సాబ్ కు వచ్చాయని చిత్ర యూనిట్ తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..