హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్‌కి సమీపంలోని ఓ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు ( Prabhas adopts forest land ). హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకి ( Hyderabad ORR ) సమీపాన ఉన్న ఖాజిపల్లె గ్రామం పరిధిలోని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లో ( Khazipally forest near Hyderabad ) ఉన్న 1,650 ఎకరాల అటవీ భూమిని ప్రభాస్ దత్తత తీసుకున్నారు. త‌న తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరిట ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ప్రభాస్ తెలిపారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ( Green India Challenge ) భాగంగా కృష్ణంరాజు ఇటీవల ప్రభాస్‌ని నామినేట్ చేశారు. పెదనాన్న కృష్ణంరాజు తనని నామినేట్ చేయడంతో ఇటీవలే తన ఇంట్లోని పెరట్లో మొక్కలు నాటిన ప్రభాస్.. కనీసం వెయ్యి ఎకరాలకు తగ్గకుండా ఏదైనా అటవీ భూమిని దత్తత తీసుకుని అభివృద్ధి పరుస్తానని అప్పుడు ట్విటర్ ద్వారా మాట ఇచ్చారు. అలా అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే ప్రభాస్ ఇవాళ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ జోగినేపల్లి సంతోష్ కుమార్‌ల సమక్షంలో ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. Also read : SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగటివ్

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దత్తత తీసుకున్న అటవీ భూమి అభివృద్ధి ( Forest development ) నిమిత్తం త‌క్ష‌ణ సాయంగా రూ.2 కోట్లు అంద‌జేసిన ప్రభాస్..  అవ‌స‌రమైతే మ‌రింత సహాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. ప్రభాస్ చేసిన ఈ పని ఆయన అభిమానులను మరింత ఆనందానికి గురిచేస్తోంది. తమ డార్లింగ్ ప్రభాస్‌ది పెద్ద హృదయం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ( Prabhas fans ) పండగ చేసుకుంటున్నారు. Also read : Turtle hi-fives alligator: మొసలికి హై-ఫైవ్ ఇచ్చిన తాబేలు


ఇక ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీతో ( Radhe Shyam ) బిజీగా ఉన్న ప్రభాస్.. ఆ తర్వాత నాగ అశ్విన్ ( Naga Ashwin ) దర్శకత్వంలో ఒక సినిమా, ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయాల్సి ఉంది. Adipurush Movie లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషించనుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో ( Saif Ali Khan as Ravan ) కనిపించనున్నాడు. Also read : Big Boss Telugu 4: బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ వీరే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR