బర్త్‌డేకి సర్ప్రైజ్ ఇస్తున్న ప్రభాస్; ఇటలీలో అనుష్క!
అక్టోబర్ 23న సర్ప్రైజ్: ఇటలీలో ప్రభాస్, అనుష్క!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. గత కొన్ని నెలలుగా ప్రభాస్ పెళ్లిపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్ళికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు షికారు చేయగా.. వీటిని ప్రభాస్ కుటుంబ సభ్యులు ఖండించారు. అయితే ఇప్పుడు ప్రభాస్, అనుష్కల పెళ్లి మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా నటుడు ప్రభాస్, నటి అనుష్క వివాహంపై గతంలో వచ్చినట్లుగా మరోసారి వార్తలు మొదలయ్యాయి. ఇద్దరూ స్నేహితులమని చెప్తున్నా వారిద్దరి పెళ్లి వార్తలకి బ్రేక్ పడటం లేదు. అనుష్క రీసెంట్‌గా ఇటలీకి వెళ్లిందని, అక్కడ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్‌ను కలిసిందని ఓ వార్త బయటకి వచ్చింది. అక్టోబర్ 23న ఇద్దరూ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియా సైతం అక్టోబర్ 23న ఇటలీలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరగనుందని పేర్కొంది.
ప్రభాస్ బర్త్‌డే అక్టోబర్ 23 కాగా, ఆ రోజు ప్రత్యేక విషయం షేర్ చేసుకోబోతున్నాను అని ప్రభాస్ తన ఫేస్‌బుక్ పేజ్ ద్వారా తెలిపారు. అందరికి దసరా శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో ప్రభాస్ చెప్పబోవు ఆ ప్రత్యేక విషయం ఏంటా అని అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు. ప్రభాస్ పెళ్లి విషయంపై క్లారిటీనా? సాహో మూవీ మేకింగ్ విడుదల చేయనున్నారా? రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న కొత్త మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందా? అని మాట్లాడుకుంటున్నారు. అయితే వీటిపై పూర్తి క్లారిటీ రావాలంటే మరో ప్రభాస్ బర్త్ డే వరకు ఆగక తప్పదు..! ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.