ఎట్టకేలకు చిత్ర బృందం 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'లో ఆమిర్ ఖాన్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించి మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. ఇప్పటికే అమితాబ్ (ఖుధాబక్ష్), కత్రినా కైఫ్ (సురైయ్య), ఫాతిమా సనా షేక్‌(జఫీరా)లకు సంబంధించిన లుక్ లు రిలీజ్ కాగా.. తాజాగా ఆమిర్ లుక్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో ‘ఫిరంగి’ అనే పాత్ర పోషిస్తున్న అమిర్.. పోనీ (పొట్టి గుర్రం)పైకి ఎక్కి సవారీ చేస్తున్న లుక్‌ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది బాలీవుడ్‌లో రాబోతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ ఒకటి. అమితాబ్ బచ్చన్- ఆమిర్ ఖాన్‌ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ మూవీపై బాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో కత్రినా కైఫ్, ఫాతిమా సనాషేక్, జాకీష్రాఫ్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తోన్న చిత్ర యూనిట్... తాజాగా ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.


విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తోంది. 1839 కాలం నాటి ఫిలిప్‌ మెడోస్‌ టేలర్‌ నవల ‘కన్ఫెషన్స్‌ ఆఫ్ థగ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి  సందర్భంగా నవంబర్8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.