కేరళ క్యూట్ గాళ్ ప్రియ ప్రకాశ్ వారియర్ గుర్తుంది కదా!! అవున్లెండి ఎందుకు గుర్తుండదు.. అంత ఈజీగా మర్చిపోయే బ్యూటీనా ఆమె. టీనేజీ ప్రాయంలోనే కొంటెగా కన్నుకొట్టిన ప్రియ ప్రకాశ్ వారియర్ వీడియో అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది మరి. ఓరు అడార్ లవ్ అనే చిత్రంలో ప్రియ ప్రకాశ్ వారియర్ హీరోను చూస్తూ కొంటేగా కన్నుకొట్టిన వీడియో ఆమెను ఓవర్ నైట్‌లోనే స్టార్‌ను చేసింది. ఆ తర్వాత ప్రియ ప్రకాశ్ వారియర్ యావత్ ప్రపంచానికి సుపరిచితమైపోయింది. మొదటి సినిమా కూడా రిలీజ్ కాకముందే ప్రియ ప్రకాశ్ వారియర్ దక్కించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఆమె కన్ను గీటిన తీరుకు ఫిదా కాని కుర్రాళ్లు లేరు. అందుకే ఓరు అడార్ లవ్ విడుదల కాకముందే ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




తాజాగా ఈ కేరళ కుట్టి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ సెన్సేషన్ క్రియోట్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియ ప్రకాశ్ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలకు లక్షలకొద్ది లైక్స్, వేలాది కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. కేరళ బ్యూటీ పరువాన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు ఆమె అభిమానులు. 


 


 



 


సాధారణంగా పదుల సంఖ్యలో సినిమాలు తీసిన హీరోయిన్స్‌కి కూడా రాని క్రేజ్ ను అనతి కాలంలోనే తన సొంతం చేసుకున్న ప్రియ ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హెడ్ లైన్స్ లో నిలుస్తూనే వుంది.