ప్రియ వారియర్ పేరు గుర్తుంది కదా..! తన కనుసైగలతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈ మలయాళ భామకు సంబంధించిన ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తీరాల్సిందే. ఆమె పేరు మీద పలువురు అభిమానులు ఇప్పటికే ఫ్యాన్స్ క్లబ్బులు కూడా ప్రారంభించేశారు.  "ఒరు ఆదార్ లవ్" చిత్రంలో "మాణిక్య మలరాయ పూవి" అనే పాటలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఒక్క పాటతో ఆమె దక్షిణాదిలో మాత్రమే కాకుండా ఉత్తరాదిలో కూడా బాగా పాపులర్ అయిపోయింది. రిషి కపూర్ లాంటి వారి మనసునే దోచింది. ఒమర్ లులూ దర్శకత్వంలో రూపొందిన "ఒరు ఆదార్ లవ్"లో ప్రియ వారియర్‌తో పాటు సియాద్ షాజహాన్, రోషన్ అబ్దుల్ రహూఫ్, నూరిన్ షరీఫ్ తదితరులు నటిస్తున్నారు. జూన్ 14, 2018 తేదిన ఈ చిత్రం విడుదల అవుతోంది


తాజాగా ప్రియకు సంబంధించిన మేకప్ వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏదేమైనా ప్రియ వారియర్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను తాను ఏం చేసినా.. ఆ వీడియోలు పాపులారిటీని మాత్రం కైవసం చేసుకుంటున్నాయి.