రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న RRR ప్రీ ప్రొడక్షన్‌కి ప్యాకప్ చెప్పేశారు ఫిల్మ్ మేకర్స్. భారీ బడ్జెట్‌తో ఇద్దరు అగ్ర కథానాయకుల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా షెడ్యూల్స్‌ని కూడా దాదాపు డిజైన్ చేసుకుంది సినిమా  యూనిట్.  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలిసిందేమిటంటే.. నవంబర్‌లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు రానుంది రాజమౌళి అండ్ టీమ్. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘అరవింద సమేత’ తరవాత బ్రేక్ మోడ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఈ  షెడ్యూల్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం వర్కవుట్స్ బిగిన్ చేసిన యంగ్ టైగర్, RRR లో ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనున్న ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్‌ని  తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌ని మ్యాగ్జిమం ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ తర్వాత బ్రేక్ తీసుకుని సెకండ్ షెడ్యూల్‌ని జనవరిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి  డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 


RRR సినియాలో ఓ ప్రముఖ బాలీవుడ్ కథానాయిక ఐటమ్ సాంగ్ చేయనుందని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే 2020 సంక్రాంతి నాటికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో కూడా ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ పాపులర్ హీరోయిన్లనే తీసుకుకోవాలని రాజమౌళి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫోటో షూట్ రెండు నెలల క్రితం అమెరికాలో జరిగింది.