ఫోటోల కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా..? ఇది మీకు అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే చాలా మంది ఈ అమ్మాయిని చూసి బాలీవుడ్ మిల్క్ బ్యూటీ అలియా భట్ అని అనుకుంటున్నారు. మరికొందరు ఈ అమ్మాయిని బాలీవుడ్ భామ కృతి సనన్ అని చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ మీరు ఈ అమ్మాయిని గుర్తు పట్టారా..? మీరు కూడా ఈ అమ్మాయి. .  అలియా భట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అసలు ఈ అమ్మాయి అని చెబుతున్నట్లుగా .. ఆమె అమ్మాయే కాదు. అబ్బాయి. అవును. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు.. ఓ సినిమా కోసం వేసిన వేషధారణ ఇది. ప్రస్తుతం రాజ్ కుమార్ 'లుడో' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. రాజ్ కుమార్ తన అభిమానులకు గుర్తు పట్టండి అంటూ ట్వీట్ చేశారు.  ఆ సందర్భంగా చాలా మంది అలియా భట్ అని ట్వీట్ చేశారు. 


[[{"fid":"182093","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]