Ram Charan and Jr NTR Tweets నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ అయితే చాతిని వెడల్పు చేసుకుని మరీ గర్వంగా తలను పైకి ఎత్తేసింది. ఇక టాలీవుడ్ హీరోలంతా కూడా నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా ఇలా ఉంటే.. ఆస్కార్‌కు క్రెడిట్ తీసుకోవడం, ఇచ్చుకోవడం వంటి విషయంలో మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్ గురించి తెలిసిందే. రామ్ చరణ్‌ కాస్త ముందుగా వెళ్లి లాస్ ఏంజిల్స్‌లో ప్రమోషన్స్ చేయడం, ఆ తరువాత మెల్లిగా ఎన్టీఆర్ వచ్చి ప్రమోషన్స్ చేయడం అందరికీ తెలిసిందే. ఆ గ్యాప్‌లోనే ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడని, ఆర్ఆర్ఆర్ టీం మీద, రాజమౌళి మీద గుర్రుగా ఉన్నాడనే టాక్ కూడా వచ్చింది. ఇక రామ్ చరణ్‌కు వరల్డ్ వైడ్‌గా వస్తున్న క్రేజ్ చూసి ఎన్టీఆర్ డిప్రెషన్‌లోకి వెళ్లి ఉంటాడని మెగా అభిమానులు సెటైర్లు వేస్తూ ఉండేవారు.


 



అయితే ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు వేసిన పోస్టుల మధ్య వ్యత్యాసాన్ని నెటిజన్లు వెతుకుతున్నారు. ఎన్టీఆర్ అయితే రామ్ చరణ్ పేరుని ప్రస్థావించలేదు. కావాలనే ఇలా చేశాడని మెగా అభిమానులు మండు పడుతున్నారు. డిప్రెషన్‌లో ఉండి అలా చేసి ఉండాటని మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు.


 



అదే రామ్ చరణ్‌ అయితే ఎన్టీఆర్ పేరుని ప్రత్యేకంగా ప్రస్థావించాడని, బ్రదర్ ఎన్టీఆర్ అని, మళ్లీ మనం కలిసి డ్యాన్స్ చేద్దామని అన్నాడంటూ.. ఇలా సహ నటుడికి మర్యాద ఇచ్చాడంటూ కానీ ఎన్టీఆర్ మాత్రం రామ్ చరణ్‌ పేరుని కూడా ఎత్తలేకపోయాడంటూ నెటిజన్లు సైతం కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ గొడవ, ఈ ఫ్యాన్ వార్ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఆస్కార్ రావడం ఏమో గానీ దాని క్రెడిట్ విషయంలో ఇప్పటికీ గందరగోళం నెలకొంది. పాడిన వారికి ఇవ్వాలా? రాసిన వారికి ఇవ్వాలా? డ్యాన్స్ చేసిన వారికి ఇవ్వాలా? చేయించిన వారికి ఇవ్వాలా? అన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.


Also Read:  Allu Arjun Silence on Naatu Naatu : నాటు నాటుకు ఆస్కార్.. రగిలిపోతోన్నాడా?.. నోరు విప్పని అల్లు అర్జున్


Also Read: Chiranjeevi Twitter DP : డీపీ మార్చిన చిరంజీవి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook