శ్రీదేవి మరణంపై తీవ్ర ఆవేదనకు గురైన వర్మ
అతిలోక సుందరిగా, అందాల తారగా కోట్లాది మంది సినీ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర సంపాదించుకున్న నటి శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందారు.
అతిలోక సుందరిగా, అందాల తారగా కోట్లాది మంది సినీ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర సంపాదించుకున్న సినీనటి శ్రీదేవి(54) హఠాన్మరణం దేశవ్యాప్తంగా షాక్ కు గురిచేసింది. ఎంతో ఆరోగ్యంగా కనిపించే శ్రీదేవి గుండెపోటుతో మరణించిందన్న వార్తని అభిమానులు నమ్మలేకపోతున్నారు. ముఖ్యంగా ఆమెను అన్నింటికన్నా ఎక్కువగా అభిమానించే, ప్రేమించే దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీదేవి మరణం పట్ల తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
'ఆ భగవంతుణ్ణి తాను ఎన్నడూ ద్వేషించనంతగా ఈరోజు ద్వేషిస్తున్నాను. నా జీవితంలో కాంతికన్నా ఎక్కువ ప్రకాశవంతమైనది అతడు తీసుకెళ్లిపోయాడు. బోనీ కపూర్‌కి నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ చేశాడు. తాను శ్రీదేవికి వీరాభిమానినని వర్మ గతంలో చాలాసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీదేవి మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.