రంగస్థలం సినిమాతో మంచి విజయోత్సాహంతో ఉన్న టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌తో తదుపరి సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చేశాయి. ముఖ్యంగా "భరత్ అనే నేను" సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కైరా అడ్వాణీ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుందని.. దేవీశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే కన్నడ హీరో ఈ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీ సమాచారం. వీటన్నింటినీ పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మీద కూడా మొన్నటి వరకూ భిన్న వార్తలు రావడం విశేషం. ముఖ్యంగా "రాజ మార్తాండ" అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేసేశారని చాలామంది అంటున్నారు. అయితే అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం కూడా రాలేదు. 


రామ్ చరణ్, బోయపాటి కాంబినేషనులో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  వివేక్‌ ఒబెరాయ్, ప్రశాంత్‌, స్నేహ, నవీన్ చంద్రలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. అయితే టైటిల్ విషయంలోనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని.. "రాజ మార్తాండ" అనే టైటిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ పుకారు కూడా అయ్యే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. ఏదేమైనా ఈ కొత్త సినిమా టైటిల్ కోసం మెగా అభిమానులు మాత్రం వేచి చూస్తున్నారనడంలో సందేహం లేదు.