సీసీఎస్ పోలీసుస్టేషన్లో హాజరైన వర్మ
సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.
'జీఎస్టీ(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్)' వెబ్ సిరీస్ కేసులో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జీఎస్టీ వెబ్ మూవీ చర్చలో వర్మ తనను దూషించారంటూ సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఐటీ యాక్ట్ 67, సెక్షన్ 508, 509 కింద కేసులు నమోదయ్యాయి. సీసీఎస్ పోలీసులు ఇచ్చిన నోటీసు మేరకు ఆయనను ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు తీసుకొని వచ్చారు. ప్రస్తుతం పోలీసులు రాంగోపాల్ వర్మను విచారిస్తున్నారు. సీసీఎస్ పోలీసుస్టేషన్ వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.