శంకర్ దర్శకత్వం వహించిన 'రోబో 2.0' సినిమాలోని కొన్ని సన్నివేశాలు విడుదలకు ముందే లీకై సినిమా యూనిట్ ను తీవ్ర నిరాశపరిచింది. సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, సినిమాలోని సన్నివేశాలు లీక్ కావడం పట్ల రజినీ కుమార్తె సౌందర్యతో సహా ఇతర సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా రాంగోపాల్ వర్మ లీకైన 'రోబో 2.0' టీజర్ పై స్పందించారు. టీజర్ లీకైనప్పటికీ అందులోని సన్నివేశాలు దిమ్మతిరిగేలా ఉన్నాయన్నారు. 'ఏదో కారణం చేత 'రోబో 2.0' టీజర్ లీకయ్యింది. అయినప్పటికీ అందులోని సీన్లు దిమ్మతిరిగేలా ఉన్నాయి' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.