ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో ఫస్ట్ లుక్ వీడియోస్ కు షేడ్స్ ఆఫ్ సాహో గా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-1 పేరుతో ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు సాహో  చాప్టర్-2 రెడీ చేస్తున్న చిత్ర యూనిట్...మార్చిలో దీన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాహో చాప్టర్-1 పేరుతో ఫస్ట్ లుక్ వీడియో  సూపర్ హిట్ అయింది.  దుబాయ్, అబుదాదిలో తీసిన యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉన్నాయి. దీంతో  చాప్టర్-2 పై సర్వత్రా ఆసక్తి నెలకొంది


టాలీవుడ్ వర్గాల నుంచి అందించిన సమాచారం ప్రకారం షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2ను మార్చి 3న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుండట . ఎందుకంటే ఆ రోజు  హీరోయిన్  శ్రద్ధాకపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ వీడియో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాప్టర్-2లో కేవలం హీరోయిన్ ను మాత్రమే చూపిస్తారా, లేక శ్రద్ధాతో పాటు ప్రభాస్ ను కూడా చూపిస్తారా అనేది తేలాల్సి ఉంది.


కాగా సాహో సినిమా 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది . ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా బాహుబలి తరహా భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ అభిమానుల ఎక్స్పెక్టేషన్ కు ఈ మేరకు రీజ్ అవుతుందనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది