ఉత్కంఠ నడుమ సల్మాన్ ఖాన్‌కి బెయిల్ మంజూరు
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ జోధ్‌పూర్ కోర్టు జడ్జి రవీంద్ర కుమార్ జోషి తాజాగా ఆదేశాలు జారీచేశారు. దీంతో గత రెండు రోజులుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో వున్న సల్మాన్ ఖాన్ ఇక బెయిల్‌పై విడుదలై జైలు నుంచి బయటికి రానున్నాడు. సల్మాన్ ఖాన్ నుంచి రూ.50,000 విలువైన వ్యక్తిగత పూచీకత్తుతోపాటు మరో ఇద్దరు వ్యక్తుల నుంచి చెరో రూ.25,000 విలువైన పూచీకత్తును కోర్టుకు సమర్పించాల్సిందిగా కోర్టు షరతు విధించింది. అంతేకాకుండా కోర్టు అనుమతి లేనిదే సల్మాన్ ఖాన్ దేశం విడిచివెళ్లరాదు అని కోర్టు ఆదేశించినట్టుగా ఈ కేసును వాదిస్తున్న డిఫెన్స్ లాయర్ మీడియాకు తెలిపారు. డిఫెన్స్ లాయర్ వెల్లడించిన వివరాల ప్రకారం బెయిల్ డాక్యుమెంట్స్ జోధ్ పూర్ సెంట్రల్ కోర్టుకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఓ గంట లేదా రెండు గంటల్లో సల్మాన్ ఖాన్ బెయిల్ పై బయటికి వస్తారని సమాచారం అందుతోంది.
1998 అక్టోబర్‌లో హమ్ సాత్ సాత్ హై సినిమా చిత్రీకరణ సమయంలో జోధ్‌పూర్ సమీపంలోని కంకని గ్రామానికి ఆనుకుని వున్న అటవీ ప్రాంతంలో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రాజస్థాన్ పోలీసులు భారీ భద్రత మధ్య అదే రోజు సాయంత్రం సల్మాన్‌ని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు.